రాష్టాన్ని పచ్చతోరణంగా ( గ్రీన్ ఆంధ్రప్రదేశ్) మార్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. వర్షాలు కురుస్తుండటంతో మొక్కల పంపిణీకీ రంగం సిద్ధం చేస్తోంది అటవీశాఖ. జగనన్న పచ్చతోరణం కింద జిల్లాలో 1.36 లక్షల మొక్కలు నాటనున్నారు. ప్రజల భాగస్వామ్యంతో విస్తృతంగా మొక్కలు నాటాలన్నదే అధికారులు లక్ష్యం. నేరేడు, వేప, చింత, రావి, తురాయి, కానుగ, సరుగుడు తదితర జాతుల మొక్కలు సామాజిక అటవీశాఖ ఆధ్వర్యంలోని నర్సరీలలో పెంచుతున్నారు. ఇళ్ల వద్ద మొక్కలు పెంచేలా ఈ ఏడాది నుంచి శ్రద్ధ తీసుకోనున్నారు.
ఇవీ చదవండి: కొవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులే : సీపీ ఆర్కే మీనా