సిబ్బంది, విద్యార్థులు, ఆచార్యులు, సహాయ ఆచార్యుల సమష్టి కృషి వల్లే ప్రభుత్వ మానసిక వైద్యశాలకు ఐఎస్ఓ గుర్తింపు లభించిందని జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ వివరించారు. ఈ సర్టిఫికేషన్ ఇచ్చిన ఆలపాటి శివయ్యకు కలెక్టర్ ధన్యవాదాలు తెలిపారు. విశాఖ ప్రభుత్వ మానసిక ఆసుపత్రిలో మరిన్ని సదుపాయాలు కావాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాధా రాణి కలెక్టర్ని కోరారు. ఈ మేరకు ప్రతిపాదనలు పంపించాలని కలెక్టర్ ఆమెను సూచించారు.
కరోనా సమయంలో ఆసుపత్రిలోని పారిశుద్ధ్యం, సిబ్బంది సమన్వయం, అగ్నిమాపక చర్యలు, మందుల సరఫరా.. వంటి విషయాలను పరిశీలించానని ఐఎస్ఓ ఎండీ ఆలపాటి శివయ్య అన్నారు. ఈ సర్టిఫికేషన్ మానసిక ఆసుపత్రికి మూడు సంవత్సరాల వరకు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సుధాకర్, మానసిక వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్. రాధారాణి పాల్గొన్నారు.
ఇదీ చదవండీ.. ఏఎంఆర్డీఏ ఎగ్జిక్యూటివ్ కమిటీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు