విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గంలోని ప్రధాన జలాశయాల నుంచి ఖరీఫ్ సాగు ప్రారంభం నుంచి నిర్విరామంగా సాగునీటిని విడుదల చేస్తున్నారు. మాడుగుల మండలం పెద్దేరు జలాశయం నుంచి రాచకట్టు, ఆర్ఎంసి సాగునీటి కాలువలకు 60 క్యూసెక్కుల చొప్పున 120 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
దేవరాపల్లి మండలం రైవాడ జలాశయం కుడి, ఎడమ సాగునీటి కాలువలకు 100 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. చీడికాడ మండలం కోనాం జలాశయం నుంచి దిగువ, ఎగువ సాగునీటి కాలువలకు 70 క్యూసెక్కుల సాగునీటిని విడుదల చేస్తున్నారు. ఆయకట్టులో రైతులకు సాగునీటికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా తీరుతున్నాయి. జలాశయాల్లో నీటి నిల్వలు పుష్కలంగా ఉండడంతో నిరంతరం ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేస్తున్నారు. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: 'రైతన్నను వేధిస్తోన్న ఉల్లి'