విశాఖలోని రామ్ కీ ఫార్మా సిటీ విస్తరణకు కసరత్తు చేస్తున్నట్టు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ప్రకటించారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో రామ్ కీ ఫార్మా సిటీపై మంత్రి మేకపాటి సమీక్ష నిర్వహించారు. ఫార్మా సిటీ ద్వారా మరిన్ని ఉపాధి అవకాశాలు, పెట్టుబడుల పెంపునకు ప్రణాళిక చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఫార్మా సిటీ సమీపంలో గతంలో కేటాయించిన కంపెనీల స్థాపనకు వేగంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రామ్ కీ ఫార్మా సిటీలో వసతుల కల్పనపైనా చర్చించారు. ఈ సమావేశానికి రాజ్యసభ సభ్యుడు, రాంకీ ఛైర్మన్ అయోధ్యరామిరెడ్డి హాజరయ్యారు.
ఇదీ చదవండి: పెట్రో ధరల పెరుగుదల.. ఒక్కో ఎకరాపై రూ.3వేల వరకు భారం