ETV Bharat / state

విశాఖ సింహాద్రి అప్పన్న దర్శనానికి భక్తులు రావద్దని అధికారులు సూచన

author img

By

Published : Sep 28, 2021, 9:40 AM IST

Updated : Sep 28, 2021, 10:35 AM IST

Visakha Simhadri Temple
విశాఖ సింహాద్రి ఆలయం

09:35 September 28

vishaka simhadri temple road closed

విశాఖ సింహాద్రి అప్పన్న దర్శనానికి భక్తులు రావద్దని ఆలయ అధికారులు సూచించారు. తుపాన్​ కారణంగా సింహాద్రి అప్పన్న ఘాట్ రోడ్డులోని చెట్లు నేలరాలాయి. మున్సిపల్​ సిబ్బంది చెట్లను తొలగిస్తున్నారు. నేలకొరిగిన వృక్షాలను దేవస్థానం అధికారులు యుద్ధ ప్రాతిపదికన తొలగించే కార్యక్రమం చేపట్టారు.  దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు దర్శనానికి వాయిదా వేసుకోవాలని ఆలయ ఈవో విజ్ఞప్తి చేస్తున్నారు. కుండపోతగా వర్షం కురవడంతో స్వామివారి మెట్ల మార్గంలో నిత్యం ప్రవహించే దారులు వర్షపు నీటితో పొంగిపొర్లుతున్నాయని తెలిపారు. 

గాలులు వీస్తుండటంతో బండరాళ్లు పడిపోయే ప్రమాదం ఉందని ముందస్తు చర్యల్లో భాగంగా స్వామివారి ఘాట్​ రోడ్డు తాత్కాలికంగా నిలుపివేశారు. స్వామివారికి జరిగే సేవలు యధాతధంగా జరుగుతున్నాయి. స్వామివారిని సుప్రభాతసేవతో మేలుకోలిపి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం బాడ మండపం చుట్టూ తిరువీధి నిర్వహించారు.

ఇదీ చదవండీ.. somu veerraju: 'ఊడిపోయే పదవి కాపాడుకునేందుకు పేర్ని నాని ప్రయత్నం'

Last Updated : Sep 28, 2021, 10:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.