విశాఖ జిల్లా నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి నామినేషన్ ఉపసంహరణ ప్రక్రియ తర్వాత 8 మంది బరిలో ఉన్నారు. ప్రధాన పార్టీలైన తెదేపా, వైకాపా, కాంగ్రెస్, భాజపాతో పాటు... జన జాగృతి పార్టీ నుంచి అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఈ ఐదుగురే కాక..ముగ్గురు స్వతంత్రులు రంగంలో ఉన్నారు. జనసేన పార్టీకి సంబంధించి దివాకర్ వేసిన నామినేషన్‌ని ఈసీ తిరస్కరించింది. ఈ కారణంగా.. ఒకప్రధాన పార్టీ పోటీనుంచి తప్పుకున్నట్టు అయింది.
తెదేపా నుంచి అయ్యన్నపాత్రుడు, వైకాపా అభ్యర్థి ఉమాశంకర్ గణేష్, కాంగ్రెస్ అభ్యర్థి మీసాల సుబ్బన్న, భాజపా అభ్యర్థి గాదె శ్రీనివాసులు మధ్య ప్రధానంగా పోటీ ఉంటుందని సీనియర్ నాయకులు భావిస్తున్నారు. ప్రతి ఎన్నికల్లోనూ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న తవ్వా చిరంజీవితో సహ మరో ఇద్దరు అభ్యర్థులు అల్లు అప్పలనాయుడు, రాజన్న వీర సూర్య చంద్ర అనే వ్యక్తులు పోటీలో ఉన్నారు.
ఇవి కూడా చదవండి:తండ్రికి ఓటేస్తారా...తనయకు చోటిస్తారా..?