రెండేళ్లుగా విశాఖలో సైబర్ నేరాల కేసులు పెరుగుతున్నాయి. 2017లో 309 కేసులు నమోదు కాగా... 2018లో 427, 2019లో 400కు చేరుకుంది. జాతీయ స్థాయిలో 14 శాతానికి పైగా కేసులు విశాఖలోనే నమోదయ్యాయి. డిజిటల్ లావాదేవీల వినియోగం, సామాజిక మాధ్యమాల ప్రభావం, డిజిటల్ ఫార్మాట్లలో వ్యక్తిగత సమాచారాన్ని ఉంచడం, నెట్ బ్యాంకింగ్‌పై అవగాహన రాహిత్యం, సైబర్ మాయగాళ్ల వలలో పడటం వంటివి ఈ నేరాలు పెరగడానికి దోహదం చేస్తున్నాయి.
సైబర్ మోసాలు అంటే కేవలం ఆర్థికపరమైనవని భావించడం సరికాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వ్యక్తిగత సమాచారాన్ని అపహరించి, వాటితో ఆయావ్యక్తుల జీవితాల్లో అశాంతి కలిగించే ఎలాంటి సంఘటనైనా సైబర్ నేరాల కిందికే వస్తోందని చెబుతున్నారు.
నగరంలో సైబర్ నేరాల నమోదుకు ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఉండటంతో బాధితుల ఫిర్యాదుతో చాలావరకు కేసులను పోలీసులు ఛేదిస్తున్నారు. వేధింపులకు సంబంధించిన కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినట్లు పోలీసులు తెలిపారు.
ఇదీచదవండి.