ETV Bharat / state

శారీరక దృఢత్వాన్ని పెంచే విన్యాసాలతో ఆకట్టుకున్న విద్యార్థులు - విజ్ఞాన విహార ఆవాస విద్యాలయం వార్షికోత్సవ వేడుకలు

Vijnana Vihara Residential School: విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, ఇతర కార్యక్రమాలలో కూడా పాల్గొనాలి. అప్పుడే శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు. విశాఖ జిల్లా గుడిలోవ విద్యార్థులు.. ఈ కోవకే చెందుతారు. వారు చేసిన విన్యాసాలు, ధైర్య సాహసాలు చూపరులను ఆకట్టుకున్నాయి. విద్యాలయం వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని తోటి విద్యార్థులు ఆసక్తిగా తిలకించారు.

vijnana vihara residential school
విజ్ఞాన విహార ఆవాస విద్యాలయం
author img

By

Published : Jan 9, 2023, 11:55 AM IST

Updated : Jan 9, 2023, 12:59 PM IST

Vijnana Vihara Residential School: విశాఖ జిల్లా ఆనందపురం మండలం గుడిలోవలోని విజ్ఞాన విహార ఆవాస విద్యాలయం 43వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు ప్రదర్శనలను విజయనగరం ఆర్డీఓ గణపతిరావు ప్రారంభించారు. విద్యార్థుల శారీరక దారుఢ్య ప్రదర్శనలు, ధైర్య సాహసాలు గగుర్పాటు కలిగించాయి. జిమ్నాస్టిక్స్ మాదిరిగా చేసిన విన్యాసాలను రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు తిలకించి విద్యార్థులను ప్రశంసించారు.

విజ్ఞాన విహార ఆవాస విద్యాలయం 43వ వార్షికోత్సవ వేడుకలు

ఇవీ చదవండి:

Last Updated : Jan 9, 2023, 12:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.