విశాఖ నగరంలోని తాటిచెట్లపాలెం కూడలిలో ఐస్ క్రీమ్ బండ్ల కార్మికులు నిరసన చేపట్టారు. నగరంలోని వీధి విక్రయదారుల కోసం హాకర్ జోన్స్ ఏర్పాటు చేసి, గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి జి.వామనమూర్తి డిమాండ్ చేశారు. ఉపాధి కోల్పోయిన ఐస్ క్రీమ్ బండ్ల వ్యాపారులకు ప్రభుత్వం నిత్యావసర సరుకులు సరఫరా చేయాలని కోరారు.
ప్రభుత్వం నిర్మించే ఇళ్లను రెండు శాతం మేర వీధి విక్రయదారులు కేటాయించాలని వామన మూర్తి డిమాండ్ చేశారు. ఐస్ క్రీమ్ బండ్ల వ్యాపారుల నాయకుడు బంగార్రాజు, రావి కృష్ణ, రాము, ఎన్.సాయి, ఎన్. మధు రెడ్డి, చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి ప్రేమ విఫలమైందని ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య