విశాఖ ఏజెన్సీలో దారుణం జరిగింది. జి.మాడుగుల మండలం కుంబిడిసింగి పంచాయతీలోని ఉర్లమెట్ట గ్రామంలో కట్టుకున్న భార్యను కడతేర్చాడు ఓ కిరాతకుడు. సొలభం పంచాయతీ పెద్దపొలం గ్రామానికి చెందిన సోమెలి శివప్రసాద్కు జి.మాడుగుల మండలానికి చెందిన భానుమతి (21)తో గత ఏడాది వివాహం జరిగింది. నెలరోజుల నుంచి దంపతుల మధ్య వివాదాలు కొనసాగుతున్నాయని బంధువులు తెలిపారు.
తరచూ జరుగుతున్న గొడవలతో.. భానుమతి ఉర్లమెట్ట గ్రామంలోని తల్లిదుండ్రల ఇంటికి వెళ్లింది. ఆమెపై కక్ష పెంచుకున్న ఆమె భర్త అక్కడికి చేరుకుని భానుమతిని కిరాతంగా నరకేశాడు. బాధితురాలు అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం అక్కడి నుంచి శివ ప్రసాద్ పరారయ్యాడు. భానుమతి తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి:
Family Suicide: ఇద్దరు పిల్లలతో సహా.. గోదావరిలో దూకిన దంపతులు!