పెందుర్తి నియోజకవర్గాన్ని విశాఖపట్నంలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ..అఖిలపక్షం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లాల వికేంద్రీకరణ పేరుతో ప్రజల ఆక్షాంక్షలను కాలరాయటం సబబు కాదని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి అన్నారు. పెందుర్తిని విశాఖ జిల్లాలోనే ఉంచాలని 99 శాతం మంది ప్రజల కోరికను పట్టించుకోకపోవడం దురదృష్టకరమన్నారు. విశాఖపట్నంతో పెందుర్తికి విడదీయలేని అనుబంధం ఉందని గుర్తు చేశారు. అభివృద్ధి చెందుతున్న పెందుర్తిని అనకాపల్లిలో కలపటం సరికాదని హితవు పలికారు.
అనంతరం అఖిలపక్ష సభ్యులు విశాఖ శారదా పీఠం స్వరూపానందేంద్ర స్వామిని కలిశారు. పెందుర్తిని విశాఖపట్నంలోనే కొనసాగించేలా ప్రభుత్వాన్ని ఒప్పించాలని విజ్ఞప్తి చేసారు.
ఇదీ చదవండి
Chandrababu: వివేకా కేసులో ఏ వాంగ్మూలం చూసినా జగన్ దోషే: చంద్రబాబు