విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న ఆలయానికి వంగపండు శంకర్ అనే వ్యక్తి రూ.5 లక్షల భారీ విరాళం అందజేశారు. కొవిడ్ తరువాత దేవస్థానానికి భక్తుల తాకిడి పెరగడంతో విరాళాలు ఇచ్చే దాతల సంఖ్య పెరుగుతోంది. రోజుకి సగటున రూ. లక్ష రూపాయలు విరాళాలు అందుతున్నాయి. ఈ క్రమంలో విజయవాడకు చెందిన వంగపండు శంకర్ దంపతులు రూ. ఐదు లక్షలు విరాళం సమర్పించారు. స్వామి వారి నిత్య అన్నదాన పథకానికి విరాళం వినియోగించాలని భక్తుడు కోరారు.
ఇదీ చదవండి: ఆర్‌ఓలు సిద్ధంగా ఉండాలి: కలెక్టర్