ఆతిథ్య రంగం తిరిగి కొలుకోవాలంటే తప్పనిసరిగా ప్రభుత్వం సహాయం అందించాలని ఆ పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. లాక్డౌన్ ముగిశాక ఈ రంగం కేవలం 25 శాతం మాత్రమే కార్యకలాపాలను ఆరంభించగలుగుతుందని అంచనా వేస్తున్నాయి. గ్రౌండ్ జీరో నుంచి మళ్లీ తమ కార్యకలాపాలు మొదలుపెట్టాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈఎస్ఐ, పీఎఫ్ సంస్థల్లో ఉన్న వేల కోట్ల రూపాయల కార్మికుల చందాలు, బీమా మొత్తాలను ఈ లాక్డౌన్ సమయంలో కార్మికులను ఆదుకునేందుకు వినియోగించాలని పారిశ్రామిక వర్గాలు కేంద్రాన్ని కోరుతున్నాయి. కార్మికుల భద్రతే తమకు ఎప్పుడూ ముఖ్యమంటున్న ఆతిథ్య రంగ పరిశ్రమ ప్రముఖుడు, దసపల్లా హోటల్స్ డైరెక్టర్ వెంకట్‌తో ముఖాముఖి..!
ఇదీ చూడండి..