విశాఖ మన్యంలో సోమవారం సాయంత్రం జరిగిన ఎదురుకాల్పులతో మన్యంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విశాఖ - తూర్పుగోదావరి జిల్లా సరిహద్దుల్లో మావోయిస్టు అగ్రనాయకులు సమావేశమవుతున్నారనే సమాచారంతో పోలీసులు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టి... అటవీప్రాంతాన్ని జల్లెడ పట్టారు. ఈ క్రమంలోనే పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరగ్గా... మావోయిస్టు అగ్రనాయకులు తప్పించుకున్నట్లు పోలీసులు తెలిపారు.
తప్పించుకున్న చలపతి...
మావోయిస్టు అగ్రనాయకులు గణేష్, కుడుముల రవి, ఆజాద్‌లు మృతి అనంతరం కీలక నాయకుడు చలపతి ఏవోబీ సరిహద్దుల్లో మావోయిస్టు కార్యకలాపాలను నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.గత ఏడాది సెప్టెంబరులో జరిగిన కిడారి, సివేరి సోమల జంట హత్యల ఘటనలో కీలకపాత్ర వహించి అందరి దృష్టిని చలపతి ఆకర్షించాడు. అప్పటి నుంచి ఆయన్ను లక్ష్యంగా చేసుకుని ఆంధ్రా-ఒడిశా పోలీసులు గాలింపు చర్యలను నిర్వహిస్తున్నారు. సోమవారం నాటి ఎదురుకాల్పులు ఘటనలో చలపతి ఉన్నట్లు పోలీసులు నమ్ముతున్నారు.
ఇవీ చూడండి