విశాఖపట్నం డాబా గార్డెన్స్‌లోని మహాత్మా గాంధీ నగరపాలక ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థులు వైశాఖి జల ఉద్యానవనంలో కలిశారు. 1947లో ఏర్పాటైన ఈ పాఠశాలలో దశాబ్దాల క్రితం చదువుకున్న అనేక మంది పూర్వ విద్యార్థులు ఈ సందర్భంగా కలుసుకున్నారు. వారి గత స్మృతులను నెమరవేసుకున్నారు. పాఠశాల పూర్వ విద్యార్థి, ప్రస్తుత శాసన మండలి సభ్యుడు పప్పల చలపతిరావు సమావేశానికి హాజరయ్యారు. తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుని ఆనాటి ఉపాధ్యాయుల గొప్పతనాన్ని కొనియాడారు.
ఇదీ చదవండి :
గుర్తుకొస్తున్నాయి..37 ఏళ్ల తర్వాత పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక