ETV Bharat / state

గ్యాస్​ లీకేజీ బాధిత గ్రామాల్లో హైపవర్‌ కమిటీ మలివిడత పర్యటన

ఎల్‌జీ పాలిమర్స్ ఘటనపై హైపవర్ కమిటీ విచారణ జరుపుతోంది. పరిశ్రమ చుట్టుపక్కల గ్రామాలను ఈ కమిటీ మరోసారి సందర్శించనుంది.

high power committee visit to LG Polymers
ఎల్​జీ పాలీమర్స్​ ఘటనపై హైపవర్‌ కమిటీ పర్యటన
author img

By

Published : Jun 4, 2020, 8:12 AM IST

విశాఖ ఎల్​జీ పాలిమర్స్​ గ్యాస్ లీకేజీ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ ఇవాళ్టి నుంచి మూడ్రోజులపాటు పరిశ్రమ చుట్టుపక్కల గ్రామాలను మరోసారి సందర్శించనుంది. ఇప్పటికే అందించిన పరిహారం, ఇతర అంశాలపై పరిశీలన చేయనుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్‌ ఈ కమిటీకి నేతృత్వం వహిస్తున్నారు. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి కార్యదర్శి వివేక్‌ యాదవ్, విశాఖ కలెక్టర్ వినయ్ చంద్, విశాఖ సీపీ ఆర్కే మీనా ఇందులో సభ్యులుగా ఉన్నారు. వీరితో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి ముగ్గురు సభ్యులు ఉన్నారు. ఈ ముగ్గురు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొననున్నారు.

ఇదీ చదవండి:

చేతులు కట్టుకు కూర్చోలేం.. రూ.50 కోట్లు తాత్కాలిక పరిహారమే:ఎన్జీటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.