ETV Bharat / state

'ఎల్​జీ పాలిమర్స్ ఘటనపై ప్రభుత్వానికి త్వరలో తుది నివేదిక'

author img

By

Published : Jun 16, 2020, 9:07 PM IST

ఎల్​జీ పాలిమర్స్ ఘటనపై ప్రభుత్వానికి త్వరలో తుది నివేదిక సమర్పిస్తామని హైపవర్ కమిటీ ఛైర్మన్ నీరబ్ కుమార్ స్పష్టం చేశారు. ప్రమాదంపై ఎల్​జీ పాలిమర్స్ నుంచి సమాధానం రావాల్సి ఉందన్నారు.

'ఎల్​జీ పాలిమర్స్ ఘనటపై ప్రభుత్వానికి త్వరలో తుది నివేదిక'

విశాఖ విషవాయువు ఘటనపై త్వరలో ప్రభుత్వానికి తుదినివేదిక ఇవ్వనున్నట్లు హైపవర్ కమిటీ ఛైర్మన్ నీరబ్ కుమార్ స్పష్టం చేశారు. ప్రమాద ఘటనకు సంబధించి 243 మంది నుంచి విజ్ఞప్తులు, వివరాలు సేకరించామన్నారు. చరవాణి సందేశాల రూపంలో 176 అర్జీలు, సూచనలు వచ్చాయన్నారు. పర్యావరణ నిపుణులు డాక్టర్ సాగర్ ధారా, డాక్టర్ బాబురావు సూచనలు తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రమాదంపై ఎల్​జీ పాలిమర్స్ నుంచి సమాధానం రావాల్సి ఉందన్నారు.

ప్రభుత్వ నిపుణుల కమిటీ, సాంకేతిక కమిటీ నివేదికలు అధ్యయనం చేస్తామన్న ఆయన..గడువులోగా తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తామని వెల్లడించారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.