హైకోర్టు న్యాయమూర్తి శేషసాయి కుటుంబ సభ్యులతో కలిసి సింహాద్రి అప్పన్నను దర్శించుకున్నారు. ఈవో సూర్యకళ ఆలయ మార్యాదలతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. ముందుగా స్వామి వారి కప్ప స్తంభం ఆలింగనం చేసుకుని అనంతరం అంతరాలయంలో స్వామిని దర్శించుకున్నారు. ఆయన వెంట జిల్లా న్యాయమూర్తులు ఉన్నారు. "ఆధ్యాత్మికతతో నిండిన ఈ పవిత్ర ఆలయ దర్శనంతో నా జన్మధన్యమైన భావన కలుగుతోంది" అంటూ జస్టిస్ శేషసాయి విజిటర్స్ బుక్లో రాశారు. వ్రతాలు, పూజలకు ఏర్పాటు చేసిన కొత్త మండపం, కళ్యాణ మండపంపై నిర్మించటంపై ప్రశంసలు కురిపించారు.
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయాన్ని హైకోర్టు న్యాయమూర్తి ఉమాదేవి దర్శించుకున్నారు. ఆలయ ఈవో పెద్దిరాజు ఆమెకు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు దగ్గరుండి పర్యవేక్షించారు. రాహు-కేతు సర్ప దోష నివారణ పూజలో పాల్గొన్న అనంతరం స్వామి అమ్మవార్లను న్యాయమూర్తి ఉమాదేవి దర్శించుకున్నారు.
ఇదీ చదవండి
BUGGANA: ఇప్పటివరకు రూ.లక్షా 27 వేల కోట్లు అప్పు: ఆర్థికమంత్రి బుగ్గన