విశాఖ జిల్లా ఎలమంచిలిలో భారీ వర్షాల కారణంగా పలు కాలనీలు ముంపునకు గురయ్యాయి. సోమవారం రాత్రి కుండపోతగా కురిసిన వర్షాలకు గెడ్డలు పొంగి ప్రవహించాయి. అయోధ్యపురి కాలనీ, అల్లూరి సీతారామరాజు కాలనీ, మిలటరీ కాలనీలు నీటమునిగాయి. బాధితులు ముంపు నీటిలో బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు.
చోడవరంలో...
చోడవరంలో కురుస్తున్న భారీ వర్షాలకు నివాసిత ప్రాంతాలు నీట మునిగాయి. పట్టణంలో 9.3 సెం.మీ మేర వర్షపాతం నమోదైంది. వర్షపు నీరు ఇళ్లలోకి చేరడంతో ముంపు ప్రాంత వాసులు ఇబ్బందులకు గురవుతున్నారు.
తాండన నదీలో భారీగా చేరుతున్న నీరు..
పాయకరావుపేటకు సమీపంలోని తాండవ నదిలో భారీగా వరద పెరిగింది. దొరనగర్, చాకలిపేట, పల్లి వీధి తదితర ప్రాంతాలు జలమయమయ్యాయి. తీర ప్రాంతమైన పెంటకోటలో ఉప్పుటేరు పొంగి మత్స్యకారుల బోట్లు సముద్రంలోకి కొట్టుకుపోయాయి. దీంతో విలువైన వలలు, బోట్ల ఇంజిన్లు గల్లంతైనట్లు మత్స్యకారులు వాపోతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను రెవెన్యూ, పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇదీ చదవండి