విశాఖ మన్యంలో కుండపోత వర్షం కురిసింది. గురువారం సాయంత్రం నుంచి ఎడతెరిపిలేకుండా వర్షం పడటంతో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఏజెన్సీలో కొన్ని ప్రాంతాల్లో ఇబ్బందులు ఎదురౌతున్నాయి. గూడెంకొత్తవీధి మండలం ధారాలమ్మ ఘాట్ రహదారిలో కొండచరియలు విరిగిపడటంతో రాకపోకలు నిలిచిపోయాయి. పదులు సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. వర్షం తగ్గుముఖం పట్టిన తరువాత ప్రయాణికులందరు కలిసి రోడ్డుపై ఉన్న చెట్లు, రాళ్లను తీసేశారు. అదేవిధంగా విశాఖ-తూర్పుగోదావరి జిల్లాలను కలుపుతూ ఉండే ధారకొండ-గుమ్మిరేవుల రహదారిలో ఉన్న పలు కల్వర్టులు మీదుగా వర్షపునీరు పొంగిప్రవహించింది. దీంతో ఇరువైపులా రాకపోకలు నిలిచిపోయాయి. గిరిజనులు నిత్యవసర సరుకులకు ఇబ్బందులు పడుతున్నారు. మన్యంలో ఉన్న జలపాతాలకు కొంత అందం తెచ్చిపెట్టింది. జలపాతాలు వర్షపునీరు జలసవ్వడి చేస్తున్నాయి. పిల్లిగెడ్డ, వలసగెడ్డ, కొంగపాకలు గెడ్డలు పొంగి ప్రవహిస్తున్నాయి.
ఇవీ చదవండి