మత్తు వైద్య నిపుణుడు సుధాకర్‌తో విశాఖలో పోలీసులు వ్యవహరించిన ఘటనపై విచారణను సీబీఐకు అప్పగించడాన్ని హర్షిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం కార్యదర్శి డా. పిడకల శ్యామ్ సుందర్ పేర్కొన్నారు. బాధితుడికి న్యాయం జరగాలని తాము రోడ్డెక్కడం వలన ఈ కరోనా కాలంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతారనే ఉద్దేశంతో.. తాము ఎటువంటి చర్యలకు పాల్పడలేదని ఆయన తెలిపారు. ఘటన తర్వాత వైద్యులు సుధాకర్‌తో తాను మాట్లాడానని, తిరిగి తన ఉద్యోగం తనకు ఇప్పిస్తే పేదలకు సేవ చేసుకుంటానని తెలిపారని డా.శ్యామ్ అన్నారు.
ఇదీ చదవండి :