రాజధాని ప్రతిపాదన తీసుకొచ్చిన క్రమంలో.. నగర నీటి అవసరాల్ని అధిగమించేందుకు జీవీఎంసీ కీలక ప్రణాళికలు చేస్తోంది. ప్రస్తుతం మేఘాద్రిగెడ్డ, ముడసర్లోవ జలాశయాలకు అదనంగా పీఎంపాలెం సమీపంలోని సంభువానిపాలెం తుమురుగెడ్డ, గంభీరంగెడ్డ జలాశయాల్ని జీవీఎంసీ తన పరిధిలోకి తీసుకుంటోంది. భారీగా నిధులు సమకూర్చి పైపులైన్లు వేసేందుకు చర్చలు జరుపుతోంది. ముడసర్లోవ రిజర్వాయర్ నుంచి పీఎంపాలెం, సంభువానిపాలెం అటవీప్రాంతంలో ఉండే తుమురుగెడ్డ జలాశయానికి ఓ పైపులైను వేసి 2 జలాశయాల్ని అనుసంధానించాలని జీవీఎంసీ నిర్ణయించింది.
పోలవరం ప్రాజెక్టు నుంచి నేరుగా విశాఖకు 4వేల 6 వందల కోట్లతో పైపులైను వేసేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. దీని వల్ల మధురవాడ, కొమ్మాది, ఎండాడ, భీమిలి పరిసరాల్లోని ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది. విశాఖపట్నం ఇండస్ట్రీయల్ వాటర్ సప్లై కంపెనీ (విస్కో)’తాజా ప్రతిపాదనల్లో కీలకం కానుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు తీసుకుంటామని జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ జి.సృజన అన్నారు.
ఇదీ చదవండి: