విశాఖ మహానగరపాలక సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛ విశాఖ మారథాన్ కార్యక్రమం జరిగింది. ఆర్.కె. బీచ్, కాళీమాత గుడి వద్ద ప్రారంభమైన ఈ మారథాన్... బీచ్ రోడ్డులోని వైఎస్ఆర్ విగ్రహం (పార్కు హోటల్) వరకు సాగింది. ఎంపీ విజయసాయి రెడ్డి ముఖ్య అతిథిగా ఈ మారథాన్లో పాల్గొన్నారు.
పలు అభివృద్ధి పనులతో ప్రజలకు మేలు
ప్రపంచ స్థాయి సుందర నగరంలో మరింత పచ్చదనం పరిరక్షణ కోసం జీవీఎంసీ కృషి చేస్తోందని ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. విశాఖ నుంచి భీమిలి వరకు నీటి వనరుల అభివృద్ధి, సైక్లింగ్ ట్రాక్ నిర్మాణాలతో జీవీఎంసీ చేసిన కృషి ప్రజలకు మేలు చేస్తోందని కితాబిచ్చారు.
స్వచ్ఛ విశాఖ లక్ష్య సాధన కోసం స్వచ్ఛ మారథాన్
నగర పౌరులకు స్వచ్ఛ భారత్ కార్యక్రమాల ప్రచారంలో చురుకుగా పాల్గొనాలని జీవీఎంసీ కమిషనర్ సృజన అన్నారు. పరిశుభ్రత, ప్రజారోగ్యం విషయంలో దేశంలోనే విశాఖను ఉత్తమ స్థానంలో నిలపాలనే ప్రయత్నాలలో భాగంగా... ఈ కార్యక్రమాన్ని తలపెట్టినట్లు తెలిపారు.
ఇదీ చదవండి:
'పోలవరానికి కేంద్రం సహకరిస్తోంది.. ప్రాజెక్టు డిజైన్లో మార్పులు ఉండవు'