అమరావతి రాజధాని ప్రాంతంలో నిర్మించ తలపెట్టిన గ్రేహౌండ్స్ శిక్షణ కేంద్రాన్ని విశాఖపట్నానికి తరలించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. అమరావతిలో కేటాయించిన భూములకు అటవీశాఖ రెండోదశ అనుమతులు రాలేదన్న కారణంతో... విశాఖలో ప్రత్యామ్నాయ భూములు కేటాయించేందుకు ప్రతిపాదించినట్లు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ బుధవారం రాజ్యసభలో వెల్లడించారు. గ్రేహౌండ్స్ శిక్షణ కేంద్రానికి తాజాగా విశాఖపట్నం జిల్లాలోని జగన్నాథపురంలో 350 నుంచి 400 ఎకరాలు కేటాయించడానికి ఆ జిల్లా కలెక్టర్ ప్రతిపాదనలు పంపినట్లు ఆయన వివరించారు. రాజ్యసభలో భాజపా సభ్యుడు సుజనాచౌదరి అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు ఆయన ఈమేరకు సమాధానం ఇచ్చారు.
గ్రేహౌండ్స్ శిక్షణ కేంద్రం అమరావతి నుంచి విశాఖకు - Greyhounds Training Center is constructed in vishaka
అమరావతిలో నిర్మించేందుకు తలపెట్టిన గ్రేహౌండ్స్ శిక్షణ కేంద్రాన్ని... విశాఖపట్నం తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది.
అమరావతి రాజధాని ప్రాంతంలో నిర్మించ తలపెట్టిన గ్రేహౌండ్స్ శిక్షణ కేంద్రాన్ని విశాఖపట్నానికి తరలించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. అమరావతిలో కేటాయించిన భూములకు అటవీశాఖ రెండోదశ అనుమతులు రాలేదన్న కారణంతో... విశాఖలో ప్రత్యామ్నాయ భూములు కేటాయించేందుకు ప్రతిపాదించినట్లు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ బుధవారం రాజ్యసభలో వెల్లడించారు. గ్రేహౌండ్స్ శిక్షణ కేంద్రానికి తాజాగా విశాఖపట్నం జిల్లాలోని జగన్నాథపురంలో 350 నుంచి 400 ఎకరాలు కేటాయించడానికి ఆ జిల్లా కలెక్టర్ ప్రతిపాదనలు పంపినట్లు ఆయన వివరించారు. రాజ్యసభలో భాజపా సభ్యుడు సుజనాచౌదరి అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు ఆయన ఈమేరకు సమాధానం ఇచ్చారు.
ఇదీ చదవండి: నదుల అనుసంధానంలో కొత్త ప్రత్యామ్నాయాలు