ETV Bharat / state

నేవీ బ్యాండ్ కచేరీకి ముఖ్యఅతిథిగా గవర్నర్

విశాఖలో నౌకా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన... నేవీ బ్యాండ్ కచేరీకి రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఐఎన్​ఎస్ డేగ నేవల్ ఎయిర్ స్టేషన్ వద్ద నావికుల నుంచి గవర్నర్ గౌరవ వందనం స్వీకరించారు.

http://10.10.50.85:6060//finalout4/andhra-pradesh-nle/thumbnail/01-December-2019/5237890_299_5237890_1575216927687.png
governor biswabhushan was the chief guest for the navy band concert
author img

By

Published : Dec 1, 2019, 10:50 PM IST

ఈ నెల నాలుగున విశాఖలో నౌకా దినోత్సవం జరగనుంది. ఈ సందర్భంగా విశాఖలో ఏర్పాటు చేసిన నేవీ బ్యాండ్ కచేరీకి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తూర్పు నౌకాదళ ప్రధాన స్ధావరమైన విశాఖకు ఆయన నేవీ ప్రత్యేక విమానంలో చేరుకున్నారు. ఈఎన్సీ చీఫ్ ఎకే జైన్ ఇతర నౌకాదళ అధికారులు, జిల్లా కలెక్టర్ నవీన్ చంద్, నగర పోలీసు కమిషనర్ ఆర్కే మీనా ఇతర ఉన్నతాధికారులు గవర్నర్​కు ఘనస్వాగతం పలికారు.

ఐఎన్ఎస్ డేగ నేవల్ ఎయిర్ స్టేషన్ వద్ద నావికుల నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించారు. కొంతసేపు నేవీ అతిథి గృహంలో విశ్రాంతి తీసుకున్న గవర్నర్...​ నేరుగా సముద్రిక ఆడిటోరియంలో నేవీ బ్యాండ్ అత్యంత క్రమశిక్షణతో చేసిన కచేరీకి హాజరయ్యారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత నేవీ ఏర్పాటు చేసిన విందుకు గవర్నర్ హాజరవుతున్నట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి: ఆశ్చర్యపరిచేలా.. అద్భుతం అనిపించేలా..!

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.