తాండవ జలాశయం అభివృద్ధికి ప్రభుత్వం రూ. 470 కోట్లు విడుదల చేసినట్లు నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ వెల్లడించారు. విశాఖ, తూర్పుగోదావరిలోని సుమారు 52 వేల ఎకరాలకు నీరందిస్తున్న ఈ పథకం కోసం.. సీఎం జగన్ నిధులు ఇచ్చినట్లు పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఏలేరు కాలువ నుంచి విశాఖ జిల్లా నాతవరం మండలంలోని తాండవ జలాశయంలోకి నీరు తరలించేందుకు.. ఎత్తిపోతల పథకం కోసం ఇవి కేటాయించినట్లు పేర్కొన్నారు.
విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలోని మూడు నియోజకవర్గాల రైతులకు.. తాండవ జలాశయం వల్ల పుష్కలంగా సాగునీరు అందుతోంది. ఇప్పుడు విడుదలైన నిధులతో.. ఏలేరు కాలువ నుంచి నీటిని మళ్లించి అదనంగా మరో రెండు నియోజకవర్గాలకు సాగునీరు అందించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఆండ్ర జలాశయం కింద ఆయకట్టుదారులు, తూర్పు గోదావరి రైతులు.. సీఎం జగన్కు రుణపడి ఉంటారని పేర్కొన్నారు. నిధుల మంజూరు పత్రాలను విలేకరులకు అందజేశారు.
ఇదీ చదవండి: