ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఆదివాసీల ప్రాంతాల్లో తమ వర్గ ప్రజలకు తీవ్రమైన నష్టం జరుగుతోందని గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అప్పలనర్స చెప్పారు. గిరిజన సలహా మండలి (టీఎసీ)లో తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని గిరిజన ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు.
జీవో నెంబర్ 3 రద్దు అమల్లోకి వస్తే.. విద్యశాఖే కాకుండా ఇతర 19 శాఖల్లో స్థానిక గిరిజనులు ఉద్యోగాలు కోల్పోతారాని ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టులో గిరిజనులకు అనుకూలంగా వాదనలు వినిపించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. అందువల్లే జీవో నెంబర్3 ను కోర్టు కొట్టేసిందని చెప్పారు. గిరిజన సంఘం ఇచ్చిన పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా గిరిజనులు నిరసన వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి: