ETV Bharat / state

వైభవంగా గోవర్ధన గిరి పూజలు - కార్తీక దీపారాధన వేడుక

విశాఖజిల్లా నర్సీపట్నం పరిధి పెద్ద బొడ్డేపల్లిలో గోవర్ధన పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో మహిళలు హాజరై పలు రకాల పిండివంటలను శ్రీ కృష్ణుడికి నైవేద్యంగా సమర్పించారు.

Govardhanagiri day celebration
శ్రీ కృష్ణుడికి పూజలు
author img

By

Published : Nov 16, 2020, 5:41 PM IST

శ్రీ కృష్ణుడు గోవర్ధన గిరిని ఎత్తిన రోజును పురస్కరించుకుని విశాఖ జిల్లా నర్సీపట్నం పరిధి పెద్ద బొడ్డేపల్లిలో గోవర్ధన పూజలు నిర్వహించారు. హరే కృష్ణ మూమెంట్ ఆధ్వర్యంలో వేడుక ఆడంబరంగా జరిగింది. గోవర్ధనగిరి దృశ్యాన్ని సుమారు 50 కిలోల కేక్, ఇతర పిండివంటల రూపంలో తయారుచేశారు.

వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో మహిళా భక్తులు హాజరయ్యారు. 108 రకాల పిండివంటలతో శ్రీ కృష్ణునికి నైవేద్యం అర్పించారు. గోపూజ నిర్వహించారు. అనంతరం కార్తీక దీపారాధన వేడుక ఘనంగా జరిపారు.

ఇదీ చదవండి:

పత్రికా దినోత్సవం.. మొక్కలు నాటిన పాత్రికేయులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.