విశాఖ గీతం విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్, బీ ఫార్మసీ, ఎమ్.ఆర్క్ కోర్సుల ప్రవేశ పరీక్షకు సంబంధించి అఖిల భారత ప్రవేశ పరీక్షను 2020 ఏప్రిల్ 11 నుంచి 21 వరకు నిర్వహిస్తున్నట్లు వర్శిటీ ఉపకులపతి ఆచార్య కె.శివరామకృష్ణ తెలిపారు. విశాఖపట్నం, హైదరాబాద్, బెంగళూరు విశ్వవిద్యాలయం క్యాంపస్లలో ఇంజినీరింగ్లో 21 బీటెక్ కోర్సులు... 13 ఎంటెక్ కోర్సులు... బీ ఫార్మసీ... ఎం ఫార్మసీ.. రెండేళ్ల ఎంఆర్క్ కోర్సులకు గ్యాట్ 2020 ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నట్లు తెలిపారు. దేశంలోని 50 పట్టణాల్లో ఆన్లైన్ విధానం ద్వారా ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు.
ప్రవేశ పరీక్షకు దరఖాస్తు విధానం
ప్రవేశ పరీక్షకు సంబంధించిన దరఖాస్తులు దేశవ్యాప్తంగా యూనియన్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, కరూర్ వైశ్యా బ్యాంక్ శాఖల్లో లభిస్తాయని తెలిపారు. గీతం ఇంజినీరింగ్ పరీక్ష కొరకూ ఆన్లైన్లో www.gitam.edu ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి చేసిన దరఖాస్తులను మార్చి 30వ తేదీలోగా అందజేయవలసి ఉంటుందని చెప్పారు. ఏప్రిల్ 5వ తేదీ నుంచి గీతం వెబ్సైట్లో హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని అన్నారు. ఏప్రిల్ 25వ తేదీన ఫలితాలను వెల్లడిస్తామని ఉపకులపతి వివరించారు.
ఇదీ చూడండి: