విశాఖ నగరంలో పలుచోట్ల చెత్త కుప్పలు పేరుకపోయాయి. 98 వార్డుల్లో వాహనాల కాంట్రాక్టులు ముగిసిపోవడం, మరికొన్నిచోట్ల వారిని బ్లాక్లిస్ట్లలో పెట్టడంతో ఈ సమస్య ఎదురైంది. . నగర శివారు ప్రాంతం నుంచి పారిశ్రామిక ప్రాంతం వరకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్ల చుట్టూ ..దుర్గంధ వాసన రావడంతో.. వారు బయటికే రావడంలేదు. అక్కయ్యపాలెం ప్రధాన రహదారి, పాతనగరం ప్రాంతమైన వన్ టౌన్ పోలీసు స్టేషన్ వరకు ఇలానే ఉంది. చాలా అపార్ట్ మెంట్ల వద్ద చెత్త కుండీలు నిండిపోయి ఉన్నాయి
కొవిడ్ కేసులు పెరుగుతున్న సమయంలో... పరిసరాలను పరిశుద్ధ్యంగా ఉంచాలని స్థానికులు డిమాండ్ చేస్తుననారు.ఇది ఇలానే ఉంటే ..వ్యాధులు వచ్చే అవకాశం ఉందని స్థానికులు భయపడుతున్నారు. ఈరోజు ఉదయం మహా విశాఖ నగరపాలక సంస్ధ తొలి సర్వసభ్య సమావేశం జరగనుంది. యుద్ద ప్రాతిపదికన నగరంలోనే పారిశుద్ధ్యం పనులు చేపట్టేలా చర్యలు తీసుకునేలా..మిగతా నాయకులు కోరనున్నారు.
ఇదీ చూడండి. మౌలిక లక్ష్య సాధనకు ఆమడ దూరంలో నిలిచిన ఐసీడీఎస్