ETV Bharat / state

450 కిలోల గంజాయి పట్టివేత.. కానిస్టేబుల్ సహా ముగ్గురు అరెస్టు - విశాాఖ జిల్లా నక్కపల్లిలో 450కిలోల గంజాయి పట్టివేత

విశాఖ జిల్లా నక్కపల్లిలోని పాటిమీద సమీపంలో.. 450 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఈ వ్యవహారంలో ఓ కానిస్టేబుల్ సహా ముగ్గురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ganjai seized at nakkapally mandal in vishakapatnam
450 కిలోల గంజాయి పట్టివేత.. కానిస్టేబుల్ సహా ముగ్గురు అరెస్టు
author img

By

Published : Jul 19, 2021, 4:32 PM IST

Updated : Jul 19, 2021, 5:17 PM IST

విశాఖపట్నం జిల్లా నక్కపల్లి మండలం పాటిమీద సమీపంలో.. పోలీసులు గంజాయిని పట్టుకున్నారు. ఈ వ్యవహారంలో ఓ కానిస్టేబుల్ సహా ముగ్గురిని అరెస్ట్ చేశారు. చీడికాడకు చెందిన కురసా జోగినాయుడు కాంట్రాక్టులు చేసి అప్పులపాలయ్యాడు. దీంతో గంజాయి అక్రమ రవాణా చేయడానికి నిర్ణయించి మధ్యవర్తుల ద్వారా కొయ్యురులో పనిచేస్తున్న కానిస్టేబుల్ జీరెడ్డి అప్పలనాయుడుని కలిశాడు. ఇతను నక్కపల్లి మండలం బోయపడుకు చెందిన డ్రైవర్ వాసపల్లి రాము ద్వారా.. బొలెరో వాహనంలో 2 రోజుల కిందట 450కిలోల గంజాయి తెచ్చారు. దీన్ని పాటిమీద వద్ద ఆదివారం సాయంత్రం నిల్వ చేస్తుండగా.. పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. గంజాయి స్వాధీనం చేసుకుని, ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశామని ఎస్సై వెంకన్న వెల్లడించారు. పట్టుబడిన గంజాయి విలువ రూ. 9 లక్షలు ఉంటుందని వెల్లడించారు.

ఇదీ చదవండి:

హెచ్చరికలు పట్టించుకోకుండా వెళ్లారు.. చివరకు..

Last Updated : Jul 19, 2021, 5:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.