విశాఖ జిల్లా చోడవరం పోలీసులు రెండు వేర్వేరు చోట్ల 938 కిలోల గంజాయిని స్వాధీనపర్చుకున్నారు. నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. వారి నుంచి రెండు చరవాణులు, రవాణాకు ఉపయోగించిన ఓ ద్విచక్ర వాహనం, బొలెరో వాహనాన్ని స్వాధీనపరుచుకున్నారు. బొలెరో వాహనంలో జోలపుట్ నుంచి అనకాపల్లి జాతీయ రహదారికి వద్దకు తీసుకెళుతుండగా.. గంజాయిని పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.1.5 కోట్లు ఉంటుందని పోలీసులు చెప్పారు.
ఇదీ చదవండి: విశాఖలో రూ.4 లక్షల విలువైన నిషేధిత గుట్కా, ఖైనీ ప్యాకెట్లు పట్టివేత