గణతంత్ర దినోత్సవం సందర్భంగా.... రక్షణ దళాల్లో విశిష్ట సేవలందించిన వారికి ప్రకటించిన సేవా అవార్డుల ప్రదాన కార్యక్రమం తూర్పునౌకాదళంలో నిర్వహించారు. తూర్పు నౌకాదళ ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ అతుల్ కుమార్ జైన్ గాలంటరీ, నాన్ గాలంటరీ అవార్డులను వివిధ నౌకాదళ యూనిట్లలో పని చేసే వారికి అందజేశారు.
విశాఖలోని సముద్రిక అడిటోరియంలో నిర్వహించిన ఈ అవార్డుల ప్రదానోత్సవానికి సీనియర్ నేవీ అధికారులు, వారి కుటుంబసభ్యులు హాజరయ్యారు. నేవల్ ఇన్వెస్టిట్యూర్ ఉత్సవం ఘనంగా జరిగింది. కమాండర్ ప్రకాష్ వివేక్కి యుద్ద సేవా పతకం అందించారు. రియర్ అడ్మిరల్ జ్యోతిన్ రైనా, నివాస్‌లకు నవ్ సేనా పతకాలు(గాలంటరీ) లభించాయి. కమడోర్లు పీసీ మరఘాత వేలన్, ఆర్. విజయ్ శేఖర్‌లకు నవసేనా మెడల్ (డివోషన్ టు డ్యూటీ), కెప్టెన్లు రవికుమార్, రామ్ దులార్ , శ్రీకాంత్ పరశ్ రాం మనేలకు విశిష్ట సేవాపతకాలు ప్రదానం చేశారు.
వికె జైన్ మెమోరియల్ గోల్డ్ మెడల్‌ను లెప్టెనెంట్ కమాండర్ వి.రాజేష్ కుమార్ సింగ్, జీవన్ రక్షక్ పడక్ అవార్డును ముఖేష్ కుమార్‌కి లభించాయి. ఐఎన్ఎస్ సుజాత, కర్ణ, చిల్కా, కళింగలకు యూనిట్ సైటేషన్లు అందించారు.
ఇదీ చదవండి: శిల్పారామాల్లో పర్యటకులకు అనుమతి: అవంతి