ETV Bharat / state

'ఏజెన్సీ విద్యార్థులకు ఉచితంగా సాంకేతిక విద్య' - విశాఖ జిల్లా తాజా వార్తలు

పదో తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులకు.. పోలీసుల ఆధ్వర్యంలో ఉచితంగా సాంకేతిక విద్యను అందించనున్నట్లు చింతపల్లి ఏఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. పోలీసు, పాడేరు ఐటీడీఏ నిధులతో పాలిసెట్ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేయించామని వివరించారు. పాలీసెట్​లో అర్హత సాధించిన విద్యార్థులకు.. అచ్యుతాపురం ప్రశాంతి పాలిటెక్నిక్ కళాశాలలో.. ఎలక్ట్రికల్, సివిల్, ఎలక్ట్రానిక్, మెకానిక్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించి ఉచిత భోజన, వసతి, శిక్షణ ఇస్తామన్నారు.

Free Technical Education for Forest Area Students
ఏఎస్పీ విద్యాసాగర్ నాయుడు
author img

By

Published : Sep 18, 2020, 11:07 PM IST

ఏజెన్సీలోని 11 మండలాల్లో 10వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థినీ, విద్యార్థులకు పోలీసుల ఆధ్వర్యంలో ఉచితంగా సాంకేతిక విద్యను అందించనున్నట్లు చింతపల్లి ఏఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. చింతపల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పాడేరు, ఐటీడీఏ, చింతపల్లి సబ్ డివిజన్ పోలీసులు సంయుక్తంగా ప్రేరణ-2020 కార్యక్రమంలో భాగంగా 10వ తరగతి పూర్తి చేసుకున్న 250 మంది విద్యార్థినీ విద్యార్థులను పాలిటెక్నిక్ విద్యను అందించేందుకు ఎంపిక చేశామన్నారు. ఆదివాసీ విద్యార్థిని, విద్యార్థులకు.. పోలీసు, పాడేరు ఐటీడీఏ నిధులతో పాలిసెట్ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేయించామని వివరించారు.

ఈ నెల 27న ప్రవేశ పరీక్ష జరుగుతుందని, ఈ మేరకు ఆన్​లైన్​లో హాల్ టికెట్లను డౌన్​లోడ్ చేసి కార్యదర్శులు, గ్రామ వాలంటీర్ల ద్వారా సంబంధిత విద్యార్థుల గృహాలకు పంపిస్తున్నామన్నారు. ప్రవేశ పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల కోసం చింతపల్లి నుంచి బస్సు సదుపాయం కల్పించామని ఏఎస్పీ వివరించారు. పాలీసెట్​లో అర్హత సాధించిన విద్యార్థులకు.. అచ్యుతాపురం ప్రశాంతి పాలిటెక్నిక్ కళాశాలలో.. ఎలక్ట్రికల్, సివిల్, ఎలక్ట్రానిక్, మెకానిక్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించి ఉచిత భోజన, వసతి, శిక్షణ ఇస్తామన్నారు. భవిష్యత్తులో వృత్తి నైపుణ్య కోర్సుల్లోనూ శిక్షణ ఇపిస్తామన్నారు.

ఇదీ చదవండీ... భాజపా 'చలో అమలాపురం' యత్నం భగ్నం...నేతల గృహనిర్బంధం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.