విద్యాసంస్థలకు సెలవులు, ఉద్యోగుల్లో చాలా మందికి వర్క్ ఫ్రం హోం..! సినిమాలు, వెబ్ సీరీస్‌లే.. వారికి టైంపాస్ సాధనాలు. కానీ మహిళలు మాత్రం ఎప్పటిలానే తమ కుటుంబ సభ్యులకోసం శ్రమిస్తూనే ఉంటారు. కొవిడ్ సమయంలో వాళ్లు ఎన్నో ఇబ్బందులు పడుతూ.. సంసారాన్ని నెట్టుకొస్తున్నారు. ఇలాంటి సాటి అతివల కష్టాన్ని గుర్తించిన నారీశక్తి బృందం.. వివిధ పట్టణాల్లో కరోనా సోకి హోం ఐసోలేషన్లో ఉన్నవారికి, వారి కుటుంబసభ్యులకు ఉచితంగా భోజనాన్ని అందిస్తోంది. గృహిణులకు పనిభారం తగ్గించడమే కాక వారు తొందరగా కోలుకునే వీలు కల్పిస్తోంది.
హైదరాబాద్, విశాఖ, కాకినాడ, గుంటూరు.. ఇలా వివిధ చోట్ల వంటశాలలను ఏర్పాటు చేసుకుని.. తమను సాయం కోరినవారికి ఆహారాన్ని చేరవేస్తోంది.. నారీశక్తి బృందం. ఈ కష్టకాలంలో అండగా ఉండటం అంతులేని ఆనందాన్ని ఇస్తోందని వారు చెబుతున్నారు. రెండు వారాలుగా ఈ సేవలు చేస్తున్న నారీశక్తి బృందం.. తమకు తోచినంత సాయం చేస్తున్న దాతలకు కృతజ్ఞతలు తెలుపుతోంది.
ఇదీ చదవండి:
మమ్మల్ని కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా గుర్తించండి: డీలర్ల సంఘం