విశాఖపట్నం జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన మద్దిగరువు, కుమడ, మూలగరువు ప్రాంతాలకు గత రెండేళ్లుగా ఉచిత బస్సు సర్వీసులు నడుస్తున్నాయి. మన్యం మారుమూల గిరిజనులకు ఉపయోగపడే విధంగా పోలీస్ శాఖ ఈ సేవలు చేపట్టింది. అయితే కరోనా కారణంగా మార్చి నెల నుంచి ఈ బస్సు సర్వీసులు నిలిచి పోయాయి. తిరిగి సోమవారం ఉచిత బస్ సర్వీసులను అధికారులు ప్రారంభించారు.
జి.మాడుగుల నుంచి స్థానిక సీఐ దేవుడు బాబు ఉచిత బస్ సర్వీస్ ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గిరిజనులకు పోలీస్ శాఖ అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు.
ఇదీ చదవండి: