ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు కొన్ని స్వచ్ఛంద సంస్థలు నిస్వార్థంగా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. విశాఖలోని వైజాగ్ ఫర్ యూ కరోనా బాధితుల కోసం ఉచిత అంబులెన్స్ సర్వీసును ప్రారంభించింది. గత లాక్డౌన్ సమయంలోనూ సుమారు 2వేల కుటుంబాలకు, ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు నిత్యావసరాలు, కూరగాయలు, మాస్కులు, శానిటైజర్లు అందజేసి.. కష్టకాలంలో ప్రజలకు అండగా నిలిచింది. ఈ సంస్థ మరో అడుగు ముందుకు వేసి ఉచిత అంబులెన్స్ సర్వీసుకు శ్రీకారం చుట్టింది.
వైరస్ బాధితులను ఉచితంగా ఆసుపత్రులకు తరలించేందుకు రెండు అంబులెన్స్‌లను ఏర్పాటు చేసినట్లు సంస్థ సభ్యుడు అట్టాడ అవినాష్ పేర్కొన్నారు. గతంలో హుద్‌హుద్ తుపాన్, తిత్లీ తుపాన్ సహా ఎల్జీ పాలిమర్స్ ఘటనల నేపథ్యంలో తమ సంస్థ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించిందని ఆయన అన్నారు. భవిష్యత్తులోనూ ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు వైజాగ్ ఫర్ యూ ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు. అంబులెన్స్ సర్వీస్ అవసరమైన వారు 9063636340 నెంబరులో సంప్రదించాలని కోరారు.
ఇదీ చూడండి.