తాండవ జలాశయం ఆధునీకరణకు ప్రభుత్వం రూ. 470 కోట్లు కేటాయించడం హర్షణీయమని.. విశాఖ జిల్లా వ్యవసాయ అభివృద్ధి మండలి చైర్మన్ చిక్కాల రామారావు తెలిపారు. పాయకరావుపేట నియోజకవర్గం గోపాలపట్నంలో మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి రైతులు పాలాభిషేకం చేశారు.
సీఎం జగన్ రైతుల సంక్షేమం దృష్టిలో ఉంచుకుని సాగునీటి వనరుల అభివృద్ధికి కృషి చేస్తున్నారని రామారావు చెప్పారు. గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు.. తాండవ నదిపై నిర్మించిన ఆనకట్టల ద్వారా సాగు, తాగునీటి అవసరాలు తీరాయని ఆయన గుర్తు చేశారు.
ఇదీ చదవండి: