విశాఖ జిల్లా రావికమతం మండలం కళ్యాణపులోవ జలాశయం వద్ద వరద నీటి ఉద్ధృతి కొనసాగుతోంది. ఆదివారం సాయంత్రం నాలుగు గేట్లను ఎత్తి అదనపు నీటిని బయటకు పంపిస్తున్నారు. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 460 అడుగులు కాగా, గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు నీటి మట్టం 459.5 అడుగులకు చేరడంతో నాలుగు గేట్లను ఎత్తి నీటిని బయటకు పంపిస్తున్నామని జలవనరుల శాఖ అధికారులు వెల్లడించారు. ఈ మేరకు ఇన్ఫ్లో 250 క్యూసెక్కులు ఉండగా, అవుట్ ఫ్లో 200 క్యూసెక్కులు. ఈ మేరకు లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: విజయవాడలో గుప్పుమంటున్న గంజాయి..!