విశాఖ జిల్లాలోని శ్రీవరాహలక్ష్మీనృసింహస్వామి దేవస్థానం ఉపాలయం సీతారామాలయంలో ధ్వజ స్తంభం కాలాతీతమై ఉదయం 6:30 గంటల ప్రాంతంలో కూలిపోయింది. దశాబ్దాల క్రితం (దాదాపు 60 ఏళ్లు) ఏర్పాటుచేసిన ఈ ధ్వజస్తంభంలోపలి కర్ర పూర్తిగా చెదలుపట్టడమే దీనికి కారణమని అధికారులు తెలిపారు. ఆలయంలోని సీసీకెమెరాలను ఈఓ సహా ఉన్నతాధికారులు పరిశీలించగా... అది తనంతట తానే పడిపోయినట్లు తేలిందన్నారు. ఇందులో ఎవరి ప్రమేయంలేదని... కాలాతీతమవ్వడమే కారణమని నిర్ధారణ అయ్యిందన్నారు. వేద మంత్రాలు, సంప్రోక్షణ తర్వాత ధ్వజస్తంభం స్థానంలో తాత్కాలిక ధ్వజస్తంభం ఏర్పాటు చేస్తామన్నారు. పది రోజుల్లో శాశ్వతంగా కొత్త ధ్వజ స్తంభం ఏర్పాటుచేస్తామని ఈఓ సూర్యకళ తెలిపారు.
ఇదీ చదవండి