విశాఖలోని పాడేరు ఏజెన్సీలో ఐదేళ్ల చిన్నారి అనుమానాస్పద మృతి కలకలం రేపింది. ఒంటి నిండా గాయాలుండటంతో.. ఎవరో కావాలనే హత్యచేసి ఉంటారని బంధువులు ఆరోపిస్తున్నారు. తల్లి వ్యవహార శైలిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎస్సై శ్రీనివాస్ సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: పుట్టినరోజు వేడుకలో అపశ్రుతి- ఆరుగురు మృతి
లగిసిపల్లిలోని పార్వతీపురం కాలనీ వద్దనున్న కోళ్ల ఫారంలో చిన్నారి తల్లి పని చేస్తోంది. పడిపోయిన దెబ్బలతో ఉన్న బాలికను ఆసుపత్రికి తరలించగా మృతి చెందిందని ఆమె చెబుతోంది. గత కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య వివాదాలు నడుస్తుండగా.. రెండు రోజుల కిందట పాడేరు పోలీస్ స్టేషన్లో పంచాయితీ పెట్టి భర్తను మందలించి పంపించారు.
ఇదీ చదవండి: