విశాఖ చింతపల్లి సబ్ డివిజన్లో ఐదుగురు మావోయిస్టు మిలీషియా సభ్యులు లొంగిపోయారు. వీరిలో మత్స్య రాజు, సన్యాసిరావు, హరి, భగత్‌రామ్, పూర్ణచందర్లు ఉన్నారు. ఈ నెలలో 13 మంది మిలీషియా సభ్యులు లొంగిపోయారని ఏఎస్పీ విద్యాసాగర్ తెలిపారు.
ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు చూసి అనేక మంది మావోయిస్టు మిలీషియా సభ్యులు లొంగుపోతున్నారని ఏఎస్పీ విద్యాసాగర్ తెలిపారు. విశాఖ జిల్లా పోలీసులు చేపట్టిన అనేక కార్యక్రమాలకు ఆకర్షితులై మిలీషియా సభ్యులు జనజీవన స్రవంతిలోకి వస్తున్నారని ఆయన అన్నారు. విశాఖ జిల్లాలో మొత్తం 25 మంది మిలీషియా సభ్యులు లొంగిపోయారని ఏఎస్పీ చెప్పారు. కోరుకోండ దళంలో కొంత మంది మిలీషియా సభ్యులు ఉన్నారన్న ఆయన... వారు కుడా లొంగిపోవాలని కోరారు.
ఇదీ చదవండి