విశాఖ జిల్లా చోడవరం నియోజకవర్గంలో ఐదుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. వారంతా ప్రభుత్వ ఉద్యోగులే కావడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. చోడవరం ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఎల్డీసీ కరోనా బారిన పడిటంతో ఆసుపత్రి వర్గాలలో కలవరం ప్రారంభమైంది. ఆమెను కలిసిన నలుగురుకు కోవిడ్ పరీక్షలు చేశారు. ఆసుపత్రిని శుభ్రం చేశారు. బుచ్చెయ్యపేట సచివాలయం కార్యదర్శికి, బుచ్చెయ్యపేట మండలంలో మరో ఇద్దరు సచివాలయ ఉద్యోగులకు కోవిడ్ సోకింది. రోలుగుంట లో మరోకరికి కోవిడ్ వచ్చింది.
చోడవరం మండలంలో 22కు చేరింది. వీరిలో 15 మంది చోడవరం పట్టణ వాసులు. కొవిడ్ సోకిన 22 మందిలో 13 మంది కోలకుని ఇంటికి చేరారని అధికార వర్గాలు తెలిపాయి.
ఇదీ చదవండి 'చోడవరం నియోజకవర్గంలో స్వచ్ఛందంగా బంద్'