ETV Bharat / state

నేటి నుంచి మలబార్‌ విన్యాసాలు - మలబార్ -2020

నేటి నుంచి మలబార్‌ విన్యాసాలు బంగాళాఖాతం వేదికగా ప్రారంభంకానున్నాయి. ఈ నెల 3 నుంచి 6వ తేదీ వరకు మొదటి దశ ‘మలబార్‌-20 విన్యాసాలు నిర్వహించనున్నారు. ఈ విన్యాసాల్లో భరత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా నౌకాదళం పాల్గొంటాయి.

First phase of Malabar exercise starts today
మలబార్‌ విన్యాసాలు
author img

By

Published : Nov 3, 2020, 10:02 AM IST

First phase of Malabar exercise starts today
మలబార్‌ విన్యాసాలు

మలబార్ నౌకాదళ విన్యాసాలు బంగాళాఖాతం వేదికగా ఈ రోజు ప్రారంభంకానున్నాయి. ఈ నెల 3 నుంచి 6వ తేదీ వరకు బంగాళాఖాతంలో మొదటి దశ ‘మలబార్‌-20 విన్యాసాలు జరగనున్నాయి. ఇండో - పసిఫిక్‌ ప్రాంత గస్తీలో రక్షణ చర్యల పటిష్ఠతకు ఉపయుక్తంగా ఉండేలా సముద్ర విన్యాసాలు జరుగుతాయని ఈస్ట్రన్‌ నేవల్‌ కమాండ్‌ వర్గాలు తెలిపాయి.

24వ విడతగా చేపడుతున్న ఈ విన్యాసాలు రెండో దశలో ఈ నెల 17 నుంచి 20వ తేదీ వరకు అరేబియా సముద్రంలో కొనసాగుతాయని పేర్కొన్నాయి. ఈ విన్యాసాల్లో భారత నౌకాదళంతోపాటు అమెరికా నేవీ, జపాన్‌ సాగర స్వీయరక్షణ భద్రతా దళం, రాయల్‌ ఆస్ట్రేలియా నౌకాదళం పాల్గొంటున్నట్లు వెల్లడించాయి. ఈ ఏడాది నుంచి ఆస్ట్రేలియా జ‌త చేర‌డం వ‌ల్ల ఈ విన్యాసాల ప్రాధాన్య‌త విస్తృతంగా పెరిగింది.

ఈ విన్యాసాల‌లో యూఎస్ నౌక జాన్ ఎస్. మెకైన్, ఆస్త్రేలియా హెర్ మెజెస్టీస్, బెల్లార‌ట్ నౌక‌లు, ఎంహెచ్ 60 హెలీకాప్ట‌ర్లు, జ‌పాన్ కి చెందిన ఒనామీ నౌక‌, ఎస్. హెచ్ 60 హెలీకాప్ట‌ర్ లు పాల్గొంటున్నాయి. భార‌త నౌకాద‌ళానికి చెందిన నౌక‌లు ర‌ణ్ విజ‌య్, శివాలిక్, సుక‌న్య‌, శ‌క్తి, జలాంత‌ర్గామి సింధురాజ్​లు ఈ విన్యాసాల్లో పాలు పంచుకుంటాయి. కొవిడ్ కార‌ణంగా నాన్ కాంటాక్ట్, ఎట్ సీ ఓన్లీ అన్న సూత్రంతో ఈ విన్యాసాలు జ‌రుగుతాయి.

మ‌ల‌బార్ తొలిద‌శ విన్యాసాలు సంక్లిష్టంగా ఉప‌రితలంపైనా, యాంటీ స‌బ్ మెరైన్, యాంటి ఎయిర్ వార్ ఫేర్ ఆప‌రేష‌న్, క్రాస్ డెస్ ఫ్లైయింగ్, సీమెన్ షిప్ ఇవాల్యుయేష‌న్లు, వెప‌న్ ఫైరింగ్ విన్యాసాలతో కూడిన షెడ్యూల్ అమ‌లు చేస్తున్నారు.

ఇదీ చదవండి: సీఎం.. సలహాదారుల చర్య కోర్టు ధిక్కరణే..! కానీ..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.