విద్యుత్ స్తంభం పై మంటలు... ఆందోళనలో స్థానికులు - విద్యుత్ స్తంభం పై మంటలు...భయాందోళనలో స్థానికులు
విశాఖ మన్యం పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్ రహదారిలో ఓ విద్యుత్ స్తంభంపై మంటలు వ్యాపించాయి. సర్వీస్ వైర్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు ఎగిసిపడ్డాయి. పక్షుల గూళ్లు సైతం కాలిపోయాయి. చుట్టుపక్కల వారు భయకంపితులై పరుగులు తీశారు. అందరూ చూస్తుండగానే మంటలు ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ సిబ్బంది పాడేరులో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. స్తంభానికి ఉన్న సర్వీస్ వైరులన్నీ తొలగించి స్తంభం పరిధిలో విద్యుత్ సరఫరా ఆపేశారు ప్రస్తుతం పాడేరులో మిగిలిన ప్రాంతాలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు.