విశాఖ జిల్లా అనకాపల్లి మండలం సిరసపల్లిలో సెల్ టవర్లో మంటలు చెలరేగాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా సెల్ టవర్ ప్యానల్ బోర్డు నుంచి మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారంతో ఘటనస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాద నష్టాన్ని అంచనా వేస్తున్నారు. సకాలంలో స్పందించి మంటలను అదుపు చేయడంతో సెల్ టవర్ పైకి మంటలు రాలేదు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది.
ఇవీ చదవండి: 'ఆ స్థలం మాదే..అక్కడ పార్క్, గ్రంథాలయం నిర్మిస్తాం'