విశాఖ జిల్లా సరిహద్దులో ఇవాళ మధ్యాహ్నం పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. జిల్లాలోని గూడెంకొత్తవీధి-కొయ్యూరు మండలాల సరిహద్దులో యు.చీడిపాలెం పంచాయతీ మండపల్లి అటవీప్రాంతంలో ఈ ఘటన జరిగినట్టు సమాచారం. మావోయిస్టు పార్టీకి చెందిన అగ్రనాయకుడు చలపతి ఆధ్వర్యంలో సుమారు 20 మంది మండపల్లి అటవీప్రాంతంలో సమావేశమవుతున్నట్లు పోలీసు వర్గాలకు సమాచారం అందడంతో... పెద్ద ఎత్తున గ్రేహౌండ్స్, ప్రత్యేక పార్టీ పోలీసు బలగాలను రెండు మండలాల సరిహద్దుల్లో మోహరించారని.. అదే సమయంలో కాల్పులు జరిగాయని తెలుస్తోంది. పరస్పర కాల్పుల్లో.. ఒకరు మృతి చెందగా, మరొకరు గాయపడినట్లు తెలుస్తోంది. అయితే పోలీసులు మాత్రం ఇంకా ధృవీకరించటం లేదు.ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదీచదవండి