విశాఖపట్నం జిల్లా బోయిపాలెం జాతీయ రహదారి వద్ద ఓ ఆయిల్ ట్యాంకర్లో మంటలు వ్యాపించాయి. ఇంజిన్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ఘటన జరిగింది. ప్రమాదాన్ని గమనించిన డ్రైవర్, క్లీనర్ రహదారిపై ట్యాంకర్ను ఆపేయడంతో ప్రాణాపాయం తప్పింది. అప్రమత్తమైన ట్రాఫిక్ సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.
ఇదీచదవండి.