విశాఖ జిల్లా ప్రహలాదపురంలోని విరాట్ నగర్ వద్ద.. విద్యుదాఘాతంతో లారీకి మంటలు అంటుకున్నాయి. గుంటూరు నుంచి విశాఖకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సుమారు లక్ష రూపాయల విలువ గల సరకు కాలిపోయింది. ప్రమాదం గుర్తించిన డ్రైవర్.. వెంటనే కిందికి దూకి ప్రాణాలను కాపాడుకున్నాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.
ఇదీ చూడండి: