ETV Bharat / state

Ferro Alloy Industries: ప్రభుత్వ స్పందన కరవు.. మూసివేతకు సిద్ధమైన 39 ఫెర్రో అల్లాయ్స్‌ పరిశ్రమలు

Ferro Alloy Industries are Closing: ధైర్యంగా పెట్టుబడులు పెట్టండి.. అన్ని సౌకర్యాలు కల్పిస్తాం.. అంటూ పారిశ్రామికవేత్తలకు సీఎం జగన్‌ పదేపదే చెప్పే మాట. అన్నింటిలాగే ఇక్కడా వాస్తవ పరిస్థితి పూర్తి విరుద్ధంగా ఉంది. ఫెర్రోఅల్లాయ్స్‌ పరిశ్రమలు కష్టాల్లో ఉన్నాయని, ఆదుకుంటానని పాదయాత్రలో హామీ ఇచ్చిన జగన్‌... సీఎంగా బాధ్యతలు చేపట్టి నాలుగేళ్లయినా పరిశ్రమల యాజమాన్యాలకు అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వలేదు. పత్రికల్లో ప్రకటనలిచ్చినా స్పందన లేకపోవడంతో.. చేసేదిలేక ఒక్కొక్కటిగా పరిశ్రమలను మూసేస్తున్నారు.

Ferro Alloy Industries
ఫెర్రో అల్లాయ్స్ పరిశ్రమలు
author img

By

Published : Jul 4, 2023, 7:07 AM IST

ప్రభుత్వ స్పందన కరవు.. మూసివేతకు సిద్ధమైన 39 ఫెర్రో అల్లాయ్స్‌ పరిశ్రమలు

Ferro Alloy Industries are Closing: రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు రాకపోగా, ఉన్నవి తరలిపోవడంతో.. ఉపాధి అవకాశాల్లేక ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు యువత తరలిపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త పరిశ్రమల్ని ఆకర్షించడంతోపాటు, ఇప్పటికే ఉన్న పరిశ్రమలకు ఊతమివ్వాల్సిన ప్రభుత్వం.. ఆ ఊసే ఎత్తడం లేదు. పైగా భరించలేనంత కరెంటు ఛార్జీలు పెంచేయడంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న 39 ఫెర్రోఅల్లాయ్స్ పరిశ్రమలు మూతపడబోతున్నాయి.

వైఎస్సార్​సీపీ అధికారంలోకి రాకముందు యూనిట్‌కు 4 రూపాయల 95 పైసలుగా ఉన్న కరెంటు ఛార్జీల్ని.. ఈ ప్రభుత్వం 7 రూపాయల 89 పైసలకు పెంచేసింది. దీనివల్ల ఉత్పత్తి వ్యయం టన్నుకు 12 వేల నుంచి 16 వేలకు వరకు పెరుగుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో తమ ఉత్పత్తుల డిమాండ్‌ తగ్గడంతో ఫెర్రో అల్లాయ్స్‌ పరిశ్రమలు మూతపడుతున్నాయి. రాష్ట్రంలోని మొత్తం ఫెర్రో అల్లాయ్స్‌ పరిశ్రమల్లో.. విశాఖ, విజయనగరం, అనకాపల్లి జిల్లాల్లోనే 21 ఉన్నాయి.

వాటిలో ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఇప్పటివరకు 8 మూతపడ్డాయని, జులై 15 నాటికి మిగతా వాటికీ తాళం వేస్తారని ఫెర్రో అల్లాయ్స్‌ పరిశ్రమల ప్రతినిధులు చెబుతున్నారు. ఏప్రిల్‌ నుంచి విద్యుత్‌ ఛార్జీలు పెంచడం, మార్కెట్‌లో మెటల్‌కు సరైన ధర లేకపోవడంతో కంపెనీ నిర్వహణ కష్టంగా ఉందని, ఈ నెల 14 నుంచి లేఆఫ్‌ ప్రకటిస్తున్నట్లు విజయనగరం జిల్లాలోని స్మెల్‌టెక్‌ కంపెనీ తాజాగా నోటీసుబోర్డు పెట్టింది.

ఫెర్రో అల్లాయ్స్‌ పరిశ్రమలకు ప్రధాన ముడిసరకు విద్యుత్తే. సాధారణంగా ఫెర్రో అల్లాయ్స్‌ పరిశ్రమల్లో మొత్తం ఉత్పత్తి ఖర్చులో 30 శాతం విద్యుత్​కే అవుతుంది. ఒక టన్ను ఉత్పత్తికి 4వేల నుంచి 4వేల 500 యూనిట్ల విద్యుత్‌ అవసరమవుతుంది. ఫెర్రో సిలికాన్‌ వంటి ప్రత్యేక ఉత్పత్తుల్ని చేసే పరిశ్రమల్లో టన్నుకు 8వేల 500 నుంచి 9 వేల యూనిట్ల విద్యుత్‌ కావాలి. గత ప్రభుత్వ హయాంలో విద్యుత్‌ ఛార్జీలు నిలకడగా ఉన్నాయి. అయినా తమకు భారమవుతోందని అప్పటి ప్రభుత్వం దృష్టికి తేగా.. 2016 - 17లో యూనిట్‌కు రూపాయిన్నర చొప్పున, 2017 - 18లో 75 పైసల చొప్పున రాయితీ ఇచ్చింది.

వైఎస్సార్​సీపీ అధికారంలోకి వచ్చాక నేరుగా కరెంటు ఛార్జీలు పెంచకపోయినా, వివిధ రూపాల్లో బాదుడు మొదలుపెట్టింది. యూనిట్‌కు 6 పైసలుగా ఉన్న విద్యుత్‌ సుంకాన్ని రూపాయికి పెంచేసింది. ట్రూఅప్, సర్దుబాటు, డిమాండ్‌ ఛార్జీల పేరుతో మోత మోగించింది. మొత్తంగా 7 రూపాయల 89 పైసల భారం మోపారు. 2023-24లో ఇంధన సర్దుబాటు ఛార్జీల కింద యూనిట్‌కు రూపాయి 10 పైసల వంతున డిస్కంలు ప్రతిపాదనలు సమర్పించాయి. అందులో ప్రస్తుతం 40 పైసల చొప్పున వసూలు చేశాయి. మిగిలిన 70 పైసలు భవిష్యత్తులో ట్రూఅప్‌గా వసూలు చేసే అవకాశం ఉంది. ఇవన్నీ కలిపితే యూనిట్‌కు 8 రూపాయల 59 పైసలు అవుతుంది.

ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, పశ్చిమబెంగాల్‌లో మాత్రమే ఫెర్రోఅల్లాయ్స్‌ పరిశ్రమలు ఉన్నాయి. మిగిలిన రాష్ట్రాల్లో విద్యుత్‌ ఛార్జీలు చాలా తక్కువగా ఉండటం వల్ల, అక్కడి పరిశ్రమలతో పోటీ పడలేకపోతున్నామని.. ఏపీలోని ఫెర్రో అల్లాయ్స్‌ యాజమాన్యాలు గగ్గోలు పెడుతున్నాయి. సీఎంని కలిసి సమస్యలు చెప్పుకోవడానికి నాలుగేళ్లుగా ఎన్నోసార్లు ప్రయత్నించినా.. పరిశ్రమల యాజమాన్యాలకు అపాయింట్‌మెంట్‌ దొరకలేదు.

ఈ పరిస్థితుల్లో పత్రికల్లో ప్రకటనల ద్వారా తమ సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించాయి. ఐనా స్పందన లేకపోవడంతో ఈ నెల 15 తర్వాత మిగిలిన పరిశ్రమలన్నీ మూసివేస్తున్నట్లు లేఆఫ్‌ నోటీసులు అంటించారు. ప్రభుత్వ తీరుతో ఫెర్రోఅల్లాయ్స్‌లో ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్న30 వేల మంది, పరోక్షంగా ఉపాధి పొందుతున్న 3 లక్షల మంది రోడ్డున పడే పరిస్థితి తలెత్తింది.

వైఎస్సార్​సీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉన్న పరిశ్రమలను వెళ్లగొట్టడమే పనిగా పెట్టుకుంది. గత ప్రభుత్వ హయాంలో కుదుర్చుకున్న ఒప్పందాలు, పరిశ్రమలకు కేటాయించిన భూములపై సమీక్ష పేరుతో.. వైఎస్సార్​సీపీ ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది. దీంతో చిత్తూరు జిల్లాలో 13 వేల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనను రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఉపసంహరించింది. అనంతపురం జిల్లాలో కియా కార్ల పరిశ్రమకు గత ప్రభుత్వం తక్కువ ధరకే భూములు కట్టబెట్టిందంటూ ప్రస్తుత వైఎస్సార్​సీపీ ప్రభుత్వం వేధించింది.

ప్రోత్సాహకాలు చెల్లించకుండా ఇబ్బంది పెట్టింది. దీంతో విసిగిపోయిన కియా.. విడిభాగాలు తయారు చేసే అనుబంధ పరిశ్రమల్ని తమిళనాడులో ఏర్పాటుచేసింది. అమరరాజా పరిశ్రమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడటంతో, ఆ సంస్థ విస్తరణ ప్రాజెక్టుల్ని తెలంగాణ, తమిళనాడుల్లో చేపట్టింది. కృష్ణా జిల్లా మల్లవల్లిలో గత టీడీపీ ప్రభుత్వం.. ఎకరం 16.5 లక్షలు చొప్పున కేటాయిస్తే, ప్రస్తుత వైఎస్సార్​సీపీ ప్రభుత్వం ఎకరం 80 లక్షలకు పెంచేసింది.

గతంలో కేటాయించిన సంస్థలకూ పెంచిన ధరల ప్రకారం డబ్బు చెల్లిస్తేనే రిజిస్ట్రేషన్‌ చేస్తామని నోటీసులిను ఇచ్చింది. తాత్కాలిక కేటాయింపు ఉత్తర్వులు అందినప్పటి నుంచి 30 రోజుల్లోగా విక్రయ ఒప్పందాలు చేసుకోలేదని 81 మందికి, నిర్దేశిత గడువులోగా పూర్తి మొత్తం చెల్లించలేదన్న సాకుతో మరో 20 మందికి రద్దు నోటీసులు జారీ చేసింది. విక్రయ ఒప్పందానికి రాలేదంటూ 74 మందికి స్థల కేటాయింపులను రద్దు చేసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.